దివ్యమైనది..ధనుర్మాసం
ABN , First Publish Date - 2022-12-15T00:18:40+05:30 IST
శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ధను ర్మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసంలో ప్రాతఃకాలం ఎంతో పవిత్ర మైనది.
వైష్ణవాలయాలు ముస్తాబు
ద్వారకాతిరుమల, డిసెంబరు 14 : శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ధను ర్మాసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసంలో ప్రాతఃకాలం ఎంతో పవిత్ర మైనది. సూర్యుడు ధనస్సు నుంచి మకరరాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెలరోజులు వైష్ణవ ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి మారుగా తిరుప్పావైను పఠిస్తారు. ఈ మాసంలో ఉభయ సంధ్యలలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధ్దిస్తాయని పండితులు చెబుతున్నారు.
వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై
ధనుర్మాసం నెలరోజులూ బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పారాయణ చేస్తే కోర్కెలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆండాళ్ రచించిన దివ్యప్రబంఽధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం అని, పావై అంటే వ్రతం అని అర్థం. పురాణాల ప్రకారం విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటానని దీక్ష పూను తుంది. తన అనుభూతిని, భావాలను ఒక పద్యం అంటే పాశురం రూపంలో రచించి 30 పాశురాలను విష్ణువుకు అంకితం చేస్తుంది. ఆమె భక్తికి ముగ్దుడైన శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడతారు. గోదాకల్యాణం శ్రీవారి క్షేత్రంలో భోగి పండుగరోజున స్వామి, అమ్మవార్ల కల్యాణంతో కలసి నిర్వహిస్తారు.
ఇంటి ముంగిట గొబ్బెమ్మలు
ఈ నెలంతా ప్రతీరోజూ తమ ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉంచి వాటిని బియ్యంపిండి, పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తారు. లక్ష్మిదేవి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజిస్తే మంచి జరుగుతుందని పండితుల ఉవాచ. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం ఉంటుంది.
ప్రతీరోజూ శ్రీవారి గ్రామోత్సవం
ధనుర్మాసంలో ప్రతీరోజూ ద్వారకాతిరుమల క్షేత్రంలో ఉభయదేవేరులు, గోదాదేవితో కలసి శ్రీవారు క్షేత్రపురవీధుల్లో ఊరేగుతారు. గ్రామో త్సవం అనంతరం ధనుర్మాస మండపంలో కొలువుతీరి పూజలందుకుంటారు. ఆ తరు వాత భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరుగు తుంది. ఈ ధనుర్మాసంలో జన వరి 2న వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దీక్షాధారణ చేపట్టిన గోవింద స్వాములు శ్రీవారి తొలి దర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక మాసంగా చెప్పే ధనుర్మాసంలో భక్తులకు రోజూ పండుగే.