దసరా శోభ

ABN , First Publish Date - 2022-09-26T06:27:40+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

దసరా శోభ
మావుళ్లమ్మ ఆలయం వద్ద విద్యుత్‌ దీపాల అలంకరణ

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 25: శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 5 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువజన సం ఘం అధ్యక్షుడు బొండా సత్య కిషోర్‌, కార్యదర్శి వబిలిశెట్టి రాజా, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, మందిర చైర్మన్‌ జూలూరి వెంకటేశ్వరరావు తెలిపారు. 26న సాయంత్రం అమ్మవారికి కమిటీ ఆధ్వ ర్యంలో శిరస్సు, చక్రం అలంకారం చేస్తామని తెలిపారు. ఉదయం అమ్మవారికి గ్రా మోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న బాలాత్రిపుర సుందరి అమ్మవారు, 27న గాయత్రి దేవి, 28న అన్నపూర్ణాదేవి, 29న వారాహీదేవి, 30న ధనలక్ష్మి, 1న వైష్ణవీదేవి,2న సరస్వ తీ దేవి, 3న దుర్గాదేవి, 4న మహిషాసుర మర్ధిని అమ్మవారు, 5న శాంతా దేవి అలంకారం ఉంటాయని, అదే రోజు మధ్యాహ్నం రథయాత్ర, రాత్రి తెప్పపై ఉత్సవం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.


పెనుమంట్ర మండలంలో..


పెనుమంట్ర, సెప్టెంబరు 25: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. పెనుమంట్ర మండలంలో అమ్మవారి ఆలయాలు విద్యుత్‌ కాంతులు వెదజల్లుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి వచ్చేనెల 5 వరకు పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా కమిటీలు ఏర్పాటు చేశారు. పెనుమంట్ర కనకదుర్గమ్మ ఆలయం, నత్తారామేశ్వరం విజయ దుర్గ ఆలయం, జుత్తిగలోని కామాక్షి ఆలయం, మార్టేరు మావుళ్లమ్మ, కనకదుర్గ ఆలయాలు, వెలగలేరు తలుపులమ్మ ఆలయం, నెగ్గిపూడి వనువులమ్మ, కనకదుర్గ ఆలయాలు ఉత్సవాలు ముస్తాబు చేశారు. 9 రోజులు ప్రత్యేక అలంకారాలతో అమ్మవార్లు దర్శనమిస్తారు. కుంకుమ పూజలు, లలితా పారాయణ సామూహిక కుంకుమార్చనలు ఏర్పాటు చేశారు.

Read more