సీఎం హామీ ఏమైంది ?

ABN , First Publish Date - 2022-12-07T00:26:39+05:30 IST

గణపవరంలోని బొబ్బిలి వంతెన శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలోనెనా కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. 80 గ్రామాలకు కూడలిగా ఉన్న ఈ బొబ్బిలి వంతెనపై ప్రయా ణించాలంటే ప్రజలు వణికిపోతున్నారు.

సీఎం హామీ ఏమైంది ?
శిథిలావస్థకు చేరిన గణపవరం బొబ్బిలి వంతెన

శిథిలావస్థలో బొబ్బిలి వంతెన

ఏ క్షణంలోనైనా కుప్పకూలేందుకు సిద్ధం

గణపవరం సభలో వంతెన నిర్మాణానికి సీఎం హామీ

ఆరు నెలలు దాటుతున్నా అతీ గతీ లేదు

గణపవరం, డిసెంబరు 6: గణపవరంలోని బొబ్బిలి వంతెన శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలోనెనా కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. 80 గ్రామాలకు కూడలిగా ఉన్న ఈ బొబ్బిలి వంతెనపై ప్రయా ణించాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది మే నెలలో సీఎం జగన్‌ గణపవరం వచ్చినప్పుడు సభా ముఖంగా వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఆరు నెలలు దాటుతున్నా వంతెన నిర్మాణం గురించి అతీ గతీ లేకపోవడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

వెంకయ్య వయ్యేరుపై 1883లో నిర్మించిన ఈ వంతెనను అప్పటి బొబ్బిలి రాజు ప్రారంభించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనను బొబ్బిలి రాజు ప్రారంభించటం వల్ల ఈ వంతెనను బొబ్బిలి వంతెనగా పిలుస్తుంటారు. ఈ వంతెన మీదుగా నిత్యం ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు తర లించే వాహనాలు, పాఠశాల, ఆర్‌టీసీ బస్సులు, తిరుగు తుంటాయి. భీమవరం నుంచి గణపవరం బొబ్బిలి వంతెన మీదుగా జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి తదితర ఆర్‌టీసీ బస్సులు కూడా ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుం టాయి. ఈ వంతెన సపోర్టు వాల్స్‌ ధ్వంసం అవడం, ఫుట్‌ పాత్‌ పెద్దపెద్ద రంధ్రాలు ఏర్పాడటంతో అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. స్థానికులు నాపరాళ్లు వేసి ప్రమా దాలు జరగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేసినప్పటకీ అవి కూడా రంధ్రాల నుంచి జారి కాల్వల్లో పడిపోయాయి. అయినప్పటికి అధికారులకు కనీస మరమ్మతులు చేయా లనే ధ్యాసే కనిపించడం లేదు. టీడీపీ, వామపక్షాలు, జనసేన వంటి పార్టీలు కూడా అధికారుల దృష్టికి తీసు కెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికి దీర్ఘకాలికంగా ఈ వంతెన మరమ్మ తులకు నోచుకోకపోగా తరచూ ప్రమాదాల భారీనపడుతూ వస్తుంది. 1982లో బొబ్బిలి వంతెన కూలిపోయింది. భువనపల్లి గ్రామానికి చెందిన పత్తేం వెంకట్రావు అనే వ్యక్తి రెండు ఎడ్ల బండితో ఈ ప్రమాదానికి గురై మరణించాడు. ఈ వంతెన పిల్లర్లపై నూతన స్లాబ్‌ నిర్మించారు. 40 సంవ త్సరాల నాటికి మరలా వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెనపై ఉన్న రంధ్రాల నుంచి జారి కాల్వలో పడిపోతు న్నారు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ వడ్డుకు చేరుకుంటున్నారు..లేదంటే అంతే సంగతులు

గణపవరంలో సీఎం హామీ

ఈ ఏడాది మే 16వ తేదీన గణపవరంలో జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు శిథిలావస్థకు చేరిన బొబ్బిలి వంతన నిర్మించాలని కోరగా ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గంలోని పలు వంతెనలతో పాటు బొబ్బిలి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఆరు నెలలు దాటుతున్నా కనీసం ఇప్పటి వరకు దానిపై స్పందించనే లేదు. ప్రజలంతా ముఖ్యమంత్రి హామీ మేరకు వంతెన పనులు ప్రారంభ మవతాయని ఎదురు చూస్తు న్నారు. ఇచ్చిన హామీ మేరకు వెంకయ్యవయ్యేరుపై నూతన వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

తరచూ ప్రమాదాలు

– పెండ్యాల గోపాలకృష్ణ, పండ్ల వ్యాపారి, గణపవరం

బొబ్బిలి వంతెన పూర్తిగా శిఽథిలమైంది. సపోర్టు వాల్స్‌ విరిగిపోయాయి. ఫుట్‌పాత్‌పై పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్ప డ్డాయి. మూడేళ్ళుగా ఇదే పరిస్థితి. ఇటీవల మౌంజీపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాల్వలో పడిపోయి ఈదు కుంటూ ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. స్నేహితులతో కలిసి రంధ్రాల్లో రాళ్లు పెట్టి కొంతకాలం గడిపాం. వంతెన మరింత శిథిలావస్థకు చేరుకుంది. కనీసం అధికారులు మరమ్మతులు కూడా చేప ట్టడం లేదు. సీఎం హామీని నిలబెట్టుకోవాలి.

సీఎం హామీ నిలబెట్టుకోవాలి

–ముత్యాల శ్రీనివాసరావు, గణపవరం

గణపవరంలో నూతన వంతెన నిర్మాస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గణపవరం సభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఆరు నెలలు దాటినా ఎటువంటి ప్రతిపాదనలు లేవు. సైడ్‌వాల్స్‌ విరిగి పోవడం, వంతెనపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గణపవరంలో ముఖ్యమంత్రి ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి గణపవరం మండలాన్ని భీమవరం డివిజన్‌లో కలపడం, రెండవది బొబ్బిలి వంతెన నిర్మాణం. సీఎం ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలి.

Updated Date - 2022-12-07T00:26:41+05:30 IST