-
-
Home » Andhra Pradesh » West Godavari » cpm state secretary srinivasarao demand at kukkunuru eluru dist-NGTS-AndhraPradesh
-
నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలి : సీపీఎం
ABN , First Publish Date - 2022-07-18T06:08:40+05:30 IST
గోదావరి ముంపు వల్ల నిర్వాసితు లైన వారికి తక్షణ సహాయం కింద రూ.10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డి మాండ్ చేశారు.

కుక్కునూరు, జూలై 17 : గోదావరి ముంపు వల్ల నిర్వాసితు లైన వారికి తక్షణ సహాయం కింద రూ.10వేలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డి మాండ్ చేశారు. ఆదివారం గోదావరి వరదల్లో నిరాశ్రయులైన కుక్కునూరు బాధితులను పరామ ర్శించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం క్రింద రూ.10లక్షల ప్యాకేజీ అమలు చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వరదలు వస్తే బాధితులను అధికారులు పట్టించుకోవడం లేదని, ఎటువంటి సహాయం అందించడం లేదని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పునరావాస కాలనీల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుని అనంతరం తహసీల్దార్ భద్రయ్య దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం, నాయకులు చింతకాయల బాబూరావు, ఎ.రవి, తెల్లం రామకృష్ణ, వెంకట్రావు, వై.నాగేంద్రరావు, వలీభాషా తదితరులు పాల్గొన్నారు.