‘మహనీయులకు నివాళి మన ధర్మం’

ABN , First Publish Date - 2022-08-10T05:22:13+05:30 IST

స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులర్పించడం మన ధర్మమని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు.

‘మహనీయులకు నివాళి మన ధర్మం’
పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ బాపిరాజు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 9: స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులర్పించడం మన ధర్మమని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఏఐ సీసీ, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలో నరసాపురం కాంగ్రెస్‌ నాయకులు మార్నిడి బాబ్జి ఆధ్వర్యంలో చేపట్టిన పాద యాత్రను ఆయన ప్రారంభించారు. ముందుగా జువ్వలపాలెంలోని పుంతలో ముసలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిం చారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2022-08-10T05:22:13+05:30 IST