చెకుముకి సంబరాలు

ABN , First Publish Date - 2022-11-18T23:34:16+05:30 IST

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాల్లో భాగంగా శుక్రవారం మండల స్థాయి పోటీలు నిర్వ హించారు

చెకుముకి సంబరాలు
పోడూరులో చెకుముకి పోటీలో గెలుపొందిన విద్యార్థులు

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 18: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాల్లో భాగంగా శుక్రవారం మండల స్థాయి పోటీలు నిర్వ హించారు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం కలిగిస్తూ మూఢ విశ్వాసాలను తొలగించి వారిని చైతన్యం చేయడానికి జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఉపాధ్యక్షుడు సీహెచ్‌.ప్రసాదరావు అన్నారు. భీమవరం మండలస్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ సంబరాలు ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్‌లో హెచ్‌ఎం బి.శ్రీనివాసరావు ప్రారంభించారు. భీమవరం రూరల్‌ నుంచి ఏడు టీమ్స్‌, అర్బన్‌ నుంచి 12 టీమ్స్‌ పాల్గొన్నాయి. రూరల్‌ నుంచి దిరుసుమర్రు ప్రథమ, చినఅమిరం ద్వితీయ, కొవ్వాడ ఉన్నత పాఠశాలలు తృతీయస్థానంలో నిలిచాయి. అర్బన్‌ నుంచి చినరంగనిపాలెం ప్రథమ, ఏఆర్‌కెఆర్‌, పీఎస్‌ఎం ద్వితీయ, పీఎస్‌ఎం గరల్స్‌ స్కూల్‌ తృతీయ స్థానంలో నిలిచాయి. ప్రైవేటు పాఠశాలలో విశ్వకవి స్కూల్‌ ప్రథమ, సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ ద్వితీయ, భారతీయ విద్యాభవన్స్‌ తృతీయ స్థానంలో నిలిచాయి. వీరందరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జేవీవీ నాయకులు పి.సీతారామరాజు, బి శ్రీనివాసరావు, ఎ.జాన్సన్‌, ఎ.లోకేష్‌, ఎం.సోమేశ్వరరావు, పి.గోపాలరాజు, డి రోజా రమణి, పి శ్రీనివాసరావు, నర్సింహరాజు, తదితరులు పాల్గొన్నారు.

పోడూరు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి పోటీలు పోడూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. హెచ్‌ఎం ఐ.జనార్ధనరాజు మాట్లాడుతూ మండలంలో 8 పాఠశాలల నుంచి 8 జట్లు పాల్గొనగా పెనుమదం పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్‌ కె. పెద్దిరాజు, కోశాధికారి జె. రామ లక్ష్మణరావు, బి. శేషగిరి, కనక ప్రసాద్‌, జగదీష్‌, శారద, మస్తాన్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:43:44+05:30 IST