-
-
Home » Andhra Pradesh » West Godavari » compensation paid for porus victims-NGTS-AndhraPradesh
-
పోరస్ బాధిత కుటుంబాలకు పరిహారం
ABN , First Publish Date - 2022-04-24T06:13:51+05:30 IST
ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం పోరస్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్ర గాయాల పాలైన వారి కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణ మూర్తి, నూజివీడు ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి శనివారం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు.

ఏలూరు కలెక్టరేట్/ముసునూరు, ఏప్రిల్ 23: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం పోరస్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్ర గాయాల పాలైన వారి కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణ మూర్తి, నూజివీడు ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి శనివారం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్ కార్మికులు మనోజ్ మోచి, ఆవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్లకు సంబంధించిన ఎక్స్గ్రేషియా చెక్కులను వారి భార్యలకు రూ. 50 లక్షల చొప్పున రూ 2 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే గాయపడిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున రూ. 15 లక్షలు అందజేశారు. ముసునూరు తహసీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.