ఇంధన పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-20T23:46:34+05:30 IST
ఇంధన పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ అన్నారు.
ముగిసిన ఇంధన పొదుపు వారోత్సవాలు
ఏలూరుసిటీ, డిసెంబరు 20: ఇంధన పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా ఇఽంధన పొదుపు ఆవశ్యకతపై నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పతకాలు, జ్ఞాపికలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవన గమనంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంధనాన్ని పొదుపు చేయడంతోపాటు మానవ మనుగడకు దోహదం చేసినట్టే అన్నారు. అనంతరం డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో గెలుపొందిన బాలబాలికలకు పతకాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ విజయ్‌కుమార్, ఈఈలు టి.శశిధర్, ఎం.ఝాన్సీలతో పాటు పలువురు డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.