-
-
Home » Andhra Pradesh » West Godavari » collector muncipal employees darna at west godavari dist-NGTS-AndhraPradesh
-
‘కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలి’
ABN , First Publish Date - 2022-03-05T05:52:10+05:30 IST
మునిసిపల్ కాంట్రా క్టు ఔట్ సోర్సింగ్ సిబ్బం దిని వెంటనే పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ రిపోర్టు కు అనుగుణంగా కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వా లని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి.ప్రసాద్ డిమాండ్ చేశారు.

ఏలూరు కలెక్టరేట్, మా ర్చి 4 :మునిసిపల్ కాంట్రా క్టు ఔట్ సోర్సింగ్ సిబ్బం దిని వెంటనే పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ రిపోర్టు కు అనుగుణంగా కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వా లని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి.ప్రసాద్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మునిసిపల్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజు శుక్రవారం శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వాలు 8, 9, 10 పీఆర్సీ సందర్భంగా మునిసిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు జరిపారని, కాని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం రూ.20 వేలు కనీస వేతనం ఇవ్వాల్సి ఉండగా 15 వేలు ఇచ్చి తీరని అన్యాయం చేసిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సోమయ్య, నగర అధ్యక్షుడు జాన్‌బాబు మాట్లాడారు. వి.సాయిబాబు, రామాంజనేయులు, మస్తాన్, కె.విజయలక్ష్మి, ఎ.శ్యామలారాణి సంఘీభావం తెలిపారు. ఏలూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెంకు చెందిన 30 మంది కార్మికులు దీక్షల్లో పాల్గొన్నారు.