సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు ముస్తాబు
ABN , First Publish Date - 2022-12-31T22:56:57+05:30 IST
భీమవరం పట్టణంలో ఈనెల 2,3,4 వ తేదీల్లో జరగనున్న సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభల సన్నాహాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
భీమవరం అర్బన్/ఆకివీడు, డిసెంబరు 31 : భీమవరం పట్టణంలో ఈనెల 2,3,4 వ తేదీల్లో జరగనున్న సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభల సన్నాహాలు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటీకే పట్టణంలో అంతా ఎర్రజెండాల ఆలంకరణలతో నిండిపోయింది. ప్రతీ రోజు వందలాది మంది కార్మికులు ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. రెండో తేదీ కొత్త బస్టాండు వద్ద ఉన్న కేశవరావు హైస్కులు ఆవరణలో జరగనున్న భారత బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.