మొక్కలు నాటిన చిరంజీవి అభిమానులు

ABN , First Publish Date - 2022-08-17T05:37:41+05:30 IST

చిరంజీవి జన్మ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అయి భీమవరం రోడ్‌లో మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన చిరంజీవి అభిమానులు
ఆకివీడులో మొక్కలు నాటుతున్న అభిమానులు

ఆకివీడు, ఆగస్టు 16: చిరంజీవి జన్మ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అయి భీమవరం రోడ్‌లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడి, ఇంటింటా చెట్లు నాటి ఊరూరా పచ్చదనం తీసుకురావాలని సినీ డిస్ట్రిబ్యూటర్‌ ప్రతినిధి ముదునూరి శ్రీహరిరాజు అన్నారు. చిరంజీవి సత్యనారాయణ, కనుమూరి భాగ్యరిషిక, గొం ట్లా సత్యనారాయణ, జక్కా శ్రీను పాల్గొన్నారు.


మొగల్తూరు: చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వారం రోజులు పాటు సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కొపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మొగల్తూరులోని పలు ఆసుపత్రుల్లో రోగులకు పండు, పాలు పంపిణీ చేశారు. చిరంజీవి గృహం, గ్రంథా లయం వద్ద మొక్కలు నాటారు. దాసరి కృష్ణాజీ, లక్కు బాబి, ముక్కు గిరి, గన్నాబత్తుల రామ్‌ కుమార్‌, మేడిద ప్రభాకర్‌, దివి సత్యన్‌, పొలిశెట్టి సాంబ పాల్గొన్నారు.

Read more