చికెన్‌ కేజీ 300

ABN , First Publish Date - 2022-03-05T06:25:00+05:30 IST

వేసవి ఆరంభం నుంచి సాధారణంగా చికెన్‌ ధర తగ్గుముఖం పడుతుంటా యి.

చికెన్‌ కేజీ 300

 భారీగా పెరిగిన కోడి మాంసం ధరలు


గణపవరం, మార్చి 4:
వేసవి ఆరంభం నుంచి సాధారణంగా చికెన్‌ ధర తగ్గుముఖం పడుతుంటా యి. కానీ, దీనికి విరు ద్ధంగా ఈ ఏడాది చికెన్‌ ధర కొండెక్కింది. కరోనా సమయంలో పెరిగిన ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. మళ్లీ చికెన్‌ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. కోళ్ల దిగుబడి తగ్గింది. దీనికి తోడు మేత ధరలకు రెక్కలు వచ్చాయని పౌల్ర్టీ యజమానులు చెబుతున్నారు. గతంలో కిలో రూ.20 వున్న మేత ప్రస్తుతం రూ.60కి చేరింది. దీంతో చికెన్‌ ధర పెరిగినట్లు చెబుతున్నారు. పది రోజుల క్రితం లైవ్‌ కిలో రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.160కు చేరింది. రూ.180 ఉన్న బాయిలర్‌ మాంసం కిలో రూ.240కు, స్కిన్‌ లెస్‌ రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తున్నా రు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లోను ధరలు పెరిగే అవకాశం ఉంది. కిలో రూ.300కు చేరడంతో.. కిలో కొనేవారు అర కిలోకు పరిమితమవుతున్నారు.

Read more