చైన్‌ స్నాచింగ్‌..

ABN , First Publish Date - 2022-12-31T01:21:22+05:30 IST

కైకలూరు ఎన్జీవోస్‌ కాలనీలో తన తల్లితోపాటు జీవిస్తున్న అడిదల అన్నా సూర్యమణి తమ ఇంటికి వచ్చిన వృద్ధురాలిని ఆమె ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు సూర్యమణి మెడలోని సుమారు ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని వెళ్లిపోయారు.

చైన్‌ స్నాచింగ్‌..

కైకలూరు, డిసెంబరు 30: కైకలూరు ఎన్జీవోస్‌ కాలనీలో తన తల్లితోపాటు జీవిస్తున్న అడిదల అన్నా సూర్యమణి తమ ఇంటికి వచ్చిన వృద్ధురాలిని ఆమె ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళుతుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు సూర్యమణి మెడలోని సుమారు ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని వెళ్లిపోయారు. సూర్యమణి కేకలు వేయగా పలువురు ఆ ఆగంతకులను వెంబడించినా ఫలితం లేకపోయింది. బాధితురాలు కైకలూరు టౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఆగంతకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T01:21:22+05:30 IST

Read more