భీమవరం కాంప్లెక్స్‌లో వరుస చోరీలతో ప్రయాణికుల బెంబేలు

ABN , First Publish Date - 2022-12-07T00:31:39+05:30 IST

భీమవరం బస్‌ కాంప్లెక్స్‌లో బస్‌ ఎక్కేందుకు వెళ్తున్నారా ? మీ సెల్‌ఫోన్‌ జాగ్రత్త ! ఆద మరిచారో అంతే..

భీమవరం కాంప్లెక్స్‌లో వరుస చోరీలతో ప్రయాణికుల బెంబేలు

భీమవరం టౌన్‌, డిసెంబరు 6 : భీమవరం బస్‌ కాంప్లెక్స్‌లో బస్‌ ఎక్కేందుకు వెళ్తున్నారా ? మీ సెల్‌ఫోన్‌ జాగ్రత్త ! ఆద మరిచారో అంతే.. ఫోన్‌ చేజారినట్లే. ఇది కొన్ని రోజులుగా సాగుతోంది. సోమవారం ఒక్కరోజే మూడు సెల్‌ఫోన్‌లు పొగొట్టుకు న్నట్లు ప్రయాణికుల సమాచారం కేంద్రంలో వద్దకు వచ్చి వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. భీమ వరం జిల్లా కేంద్రమైన తర్వాత రద్దీ బాగా పెరిగింది. దీంతో ఇదే అవకాశంగా సెల్‌ఫోన్‌ దొంగలు తమ చాక చక్యంతో ఎగరేసుకుపోతు న్నారు. రద్దీగా ఉండే బస్సు ఎక్కే సమయంలో వారు తమ హస్తలాఘవంతో సెల్‌ను తన్నుకుపో తున్నారు. సంబంధిత ప్రయాణికులు తేరుకునేలోపు ఏమి కనిపించని పరిస్థితి. మూడు రోజులుగా సెల్‌ఫోన్లు పోయిన వాటిలో ఖరీదైనవే ఎక్కువ. ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రి బస్సుకు పిల్లలను ఎక్కించేందుకు వచ్చిన ఒకాయన జేబులోంచి ఖరీదైన ఫోన్‌ దొంగిలించారు. సోమవారం పోయిన మూడు ఫోన్లు ఖరీదైనవే. జంగారెడ్డిగూడెం బస్సులో ఒక యువకుడి ఫోన్‌ పోయింది. అతను ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వారు వచ్చి ప్రయాణికులను తనిఖీ చేసే వరకు బస్సు కాంప్లెక్స్‌లో ఆపేశారు. పోలీసులు వచ్చి చెప్పడంతో బస్సును పంపించారు. ఇలా రోజూ ఒకటి రెండు ఫోన్లు పోవడం రివాజుగా మారింది.

బస్‌ కాంప్లెక్స్‌లో పేరుకే కెమెరాలున్నా యి. అంతేతప్ప రికార్డింగ్‌ అవ్వడం లేదు. దీంతో అవి వున్నా అంతగా ప్రయోజనం లేదు. గతంలో దొంగతనాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు వీటిని ఏర్పాటు చేశారు. దొంగతనాలపై ఆర్టీసీ సీఐ సురేష్‌ను ప్రశ్నించగా తమకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బందోబస్తు పెంచమని పోలీసు అధికారులకు లేఖలు రాశాం. ప్రతీ రోజు బందోబస్తు ఉంటోంది. సమాచార కేంద్రం నుంచి మైక్‌ ద్వారా దొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తమ సిబ్బంది అనుమానితులు కనిపిస్తే వారిని బయటకు పంపిస్తున్నాం.

Updated Date - 2022-12-07T00:31:41+05:30 IST