ఎస్‌.ఏ.పేటలో కార్టన్‌ సెర్చ్‌

ABN , First Publish Date - 2022-04-24T06:07:21+05:30 IST

మండల పరిధిలోని సింహాద్రి అప్పారావుపేట గ్రామంలో శనివారం నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సబ్‌డివిజన్‌ పోలీసు సిబ్బంది కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

ఎస్‌.ఏ.పేటలో కార్టన్‌ సెర్చ్‌
ఎస్‌.ఏ.పేటలో పట్టుబడ్డ సారాతయారీ సామాగ్రితో డిఎస్పీ శ్రీనివాసులు, సిబ్బంది

డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాల్లో పాల్గొన్న 60 మంది పోలీసులు 

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 23 : మండల పరిధిలోని సింహాద్రి అప్పారావుపేట గ్రామంలో శనివారం నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సబ్‌డివిజన్‌ పోలీసు సిబ్బంది కార్టన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సారా తయారీ స్థావరాల  ధ్వంసమే లక్ష్యంగా నూజివీడు సీఐ అంకబాబు, ఆగిరిపల్లి ఎస్సై ఎన్‌.చంటిబు  60 మంది పోలీసు సిబ్బందితో గ్రామంలో, గ్రామ శివార్లలోని అడవులను జల్లెడ పట్టారు.  సారా తయారీ స్థావరాలను కనిపెట్టి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 7 లీటర్ల  సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.   సారా తయారు చేసినా, అమ్మినా  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సారాతయారీ, అమ్మకాలపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. Read more