డ్రైవర్ల అప్రమత్తత.. తప్పిన ప్రమాదాలు

ABN , First Publish Date - 2022-12-13T01:12:13+05:30 IST

భీమవరం నుంచి కైకలూరు 52 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

 డ్రైవర్ల అప్రమత్తత.. తప్పిన ప్రమాదాలు

భీమవరం నుంచి కైకలూరు 52 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు పల్లెవాడ వచ్చే సరికి ఓ వ్యక్తి మోటారు సైకిల్‌పై సైడ్‌ రోడ్డు నుంచి వేగంగా ప్రధాన రహదారిపైకి రావడంతో బస్సు డ్రైవరు వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు తిప్పి సడన్‌ బ్రేక్‌ వేయడంతో చెరువు అంచుల వరకు వెళ్లి ఆగింది. లేకుంటే భారీ ప్రమాదమే సంభవించేది. అలాగే విజయవాడ వెళుతున్న డీలక్స్‌ బస్సు ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వచ్చే సరికి జాతీయ రహదారిపై కొందరు వ్యక్తులను తప్పించ బోయి ఎదురుగా వున్న కరెంటు పోల్‌ను ఢీకొట్టబోయింది. డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బస్సులో కూర్చున్న వారు ముందుకు తుళ్లిపడ్డారు. ఎవరికీ ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

– కైకలూరు/తణుకు

Updated Date - 2022-12-13T01:12:13+05:30 IST

Read more