జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం
ABN , First Publish Date - 2022-06-30T05:56:12+05:30 IST
జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం
మండవల్లి, జూన్ 29: వర్షాలకు భారీ వృక్షం నేల కూలింది. బుధవారం మండవల్లి మండలం కానుకొల్లు వద్ద పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిపై భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడింది. నిత్యం జాతీయ రహ దారిపై రద్దీగా ఉంటుంది. చెట్టుకూలే సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్ధులు పేర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా చెట్టు విరిగిపడడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండవల్లి ఎస్సై టి.రామకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్కవేటర్తో చెట్టును తొలగించారు.