ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T00:12:51+05:30 IST
రహదారి ప్రమాదాల్లో గాయ పడిన వారికి సహకరిస్తే ప్రాణం కాపాడవచ్చని, ఇది బాధ్యతగా గుర్తించాలని రవాణా శాఖ ఎంవీ ఐ కెఎస్‌ఎన్.ప్రసాద్ అన్నారు.
పాలకొల్లు అర్బన్, డిసెంబరు 15: రహదారి ప్రమాదాల్లో గాయ పడిన వారికి సహకరిస్తే ప్రాణం కాపాడవచ్చని, ఇది బాధ్యతగా గుర్తించాలని రవాణా శాఖ ఎంవీ ఐ కెఎస్‌ఎన్.ప్రసాద్ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణ చర్యలు, జాగ్రత్తలపై ఆదిత్య కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షతగాత్రులకు సహాయం చేసిన వారికి ప్రశంసా పత్రం, నగదు పారితోషికం అం దిస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు ఎంవీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకుని మాత్రమే డ్రైవింగ్ చేయాలని డబుల్, ట్రిపుల్ రైడింగ్, సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చేయరాదన్నారు. డీటీవో జివిఎస్‌ఎన్ మూర్తి, హెచ్‌సీ పి.రామస్వామి, ఎం.కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ పి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.