ఏపీఈఏపీ సెట్‌ రెండో రోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2022-07-06T05:24:23+05:30 IST

ఏపీఈఏపీ సెట్‌ మంగళవారం రెండో రోజు ప్రశాంతం జరిగింది.

ఏపీఈఏపీ సెట్‌ రెండో రోజు ప్రశాంతం
హాల్‌టికెట్‌ పరిశీలిస్తున్న సిబ్బంది

భీమవరం ఎడ్యుకేషన్‌, జూలై 5 : ఏపీఈఏపీ సెట్‌ మంగళవారం రెండో రోజు ప్రశాంతం జరిగింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 440 మంది విద్యార్థులకుగాను 419 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 259 మందికి 245 మంది, విష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరీక్షా కేంద్రం లో 220 మందికి 115 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 


ఐదు నిమిషాలు ఆలస్యం.. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి

ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఒక విద్యార్థి ఏపీఈఏపీ సెట్‌ రాయలేకపోయాడు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ పరీక్షా కేంద్రానికి మధ్యాహ్నం 3:00 గంటలకు పరీక్షకు హాజరు కావల్సి ఉండగా 3:05 నిమిషాలకు వెళ్లాడు. నిబంధనల ప్రకారం ఆలస్యమైతే పరీక్ష రాయాడానికి వీలు లేకపోవడంతో సిబ్బంది అనుమతించలేదు. దీంతో పరీక్షా కేంద్రం వద్దే కొంత సేపు ఉండి వెనుదిరిగాడు.

Read more