ప్రతి ఇంజనీర్‌ ప్రతిభను చాటాలి

ABN , First Publish Date - 2022-09-11T05:39:39+05:30 IST

దేశ ప్రగతిలో విద్యార్థుల పాత్ర కీలకమని, ప్రతి ఇంజనీర్‌ .. తన ప్రతిభను నూటికి నూరుశాతం ఉపయోగిస్తే ... దేశం ప్రగతిలో దూ సుకుపోవడం ఖాయమని మోనాస్‌ రీసెర్చ్‌ అకాడమీ (ముంబై) సీఈవో ఎంఎస్‌ ఉన్నికృష్ణన్‌ పేర్కొన్నారు.

ప్రతి ఇంజనీర్‌ ప్రతిభను చాటాలి
స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న సీఈవో ఉన్నికృష్ణన్‌

 మోనాస్‌ రీసెర్చ్‌ అకాడమీ (ముంబై) సీఈవో ఎంఎస్‌ ఉన్నికృష్ణన్‌
 ఘనంగా  ఏపీ నిట్‌ నాలుగో స్నాతకోత్సవం

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 10:  దేశ ప్రగతిలో విద్యార్థుల పాత్ర కీలకమని, ప్రతి ఇంజనీర్‌ .. తన ప్రతిభను నూటికి నూరుశాతం ఉపయోగిస్తే ... దేశం ప్రగతిలో దూ సుకుపోవడం ఖాయమని మోనాస్‌ రీసెర్చ్‌ అకాడమీ (ముంబై) సీఈవో ఎంఎస్‌ ఉన్నికృష్ణన్‌ పేర్కొన్నారు. తాడేప ల్లిగూడెంలోని ఏపీ నిట్‌ ప్రాంగణంలో నాలుగో స్నాతకోత్స వాన్ని శనివారం ఘనంగా నిర్వ హించారు. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నన్స్‌ చైర్‌పర్సన్‌ మృదులా రమేష్‌ అధ్య క్షత వహించారు.  ఉన్ని కృష్ణన్‌ ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ముం దుండాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చు కోవాలన్నారు. చైర్‌పర్సన్‌ మృదులా రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతికతలో పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలకు కొదవ ఉండదన్నారు. నిట్‌ ఇన్‌చార్జ్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. ప్రమోద్‌ పడలే మాట్లాడుతూ నిట్‌లో చదువు పూర్తి చేసినవారు ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించడంతోపాటు రూ.36 నుంచి 47 లక్షల వరకు వార్షిక వేత నం అందుకుంటున్నారన్నారు. అనం తరం బీటెక్‌లో టాప్‌లో నిలిచిన విస్సశెట్టి హేమలత నాగలక్ష్మి (బ యోటెక్నాలజీ), ఇందుకూరి వినయ కుమార్‌ వర్మ (సివిల్‌ ), పులివెం దుల ప్రసూన (కంప్యూటర్‌ సైన్స్‌), పాకాల సాయి తరుణ్‌ (ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌), నంది కౌషిక్‌ (ఎలకా్ట్ర నిక్స్‌), కొప్పిశెట్టి దిలీప్‌ (మెకా నికల్‌), ఓ.శివాని (మెటలాజి కల్‌)తోపాటు 448కి గ్రాడ్యుయేట్‌ పట్టాలు, ఎంటెక్‌ పూర్తిచేసిన 46 మందికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.  పులివెందుల ప్రసూన 9.69 గ్రేడ్‌ పాయింట్లతో నిట్‌ టాపర్‌గా నిలవడంతో గోల్డ్‌మెడల్‌ అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పి. దినేష్‌ శంకర్‌ రెడ్డి, డీన్‌లు డాక్టర్‌ జీఆర్‌కే శాస్త్రి, డాక్టర్‌ బీవీ వీరేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T05:39:39+05:30 IST