ఏపీ ఎన్జీవోల ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-12-15T00:22:27+05:30 IST
ఏపీ ఎన్జీవోల సంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్ శ్రీనివాస్, ఎన్.రామారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనివాస్, రామారావు ఏకగ్రీవం
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 14 : ఏపీ ఎన్జీవోల సంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన కార్యవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్ శ్రీనివాస్, ఎన్.రామారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఏలూరు ఎన్జీవో హోంలో నూతన కార్యవర్గ ఎన్నికల షెడ్యూలులో భాగంగా నామి నేషన్ల స్వీకరణను చేపట్టగా శ్రీనివాస్ ప్యానెల్ ఒక్కటే నామి నేషన్లను దాఖలు చేయగా, ఆ ప్యానెల్‌ను ఉమ్మడి జిల్లాలోని 15 తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు, ఓటుహక్కు వున్న 293 మంది సభ్యు లందరూ ఆమోదించడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా ఎన్జీవోల సంఘ అద్యక్షుడు జీ.రామ్మోహనరావు ప్రకటించారు. కాగా నూతన కార్యవర్గానికి సహ అధ్యక్షుడిగా పీ.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు, కే.సునీత, మూర్తి, నోరి శ్రీనివాసరావు, ఎస్.నా రాయణ నాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డీ.నరేంద్రబాబు, సంయుక్త కార్యదర్శులుగా ఖాదర్‌బేగ్, లీలారాణి, ఫణికుమార్, సాంబశివరావులను ఎన్నుకున్నారు. మహిళా సంయుక్త కార్యదర్శిగా వీ.మల్లిక, కోశాధికారిగా పీ.శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు.
మహిళా విభాగానికి..
ఎన్జీవో మహిళా విభాగం ఉమ్మడి జిల్లా చైర్‌పర్సన్‌గా కే.నాగమణి, కో–చైర్‌పర ్సన్‌గా యూ.బేబీ ఉమ, వైస్ చైర్మన్లుగా బీ.హెచ్ కృష్ణప్రియ, టీ.రత్నకుమారి, ఎస్.బీ.ఎన్ కృష్ణవేణి, యశోదమ్మ, కన్వీనర్‌గా డీ.నాగ దేవి, కో–కన్వీనర్‌గా జీ.సత్యశ్రీలను ఎన్నుకున్నారు. సంయుక్త కన్వీనర్లుగా జీ.నాగమణి, ఎండీ.జాహబ్, సుమలత, బీ.భారతి, నాగమణి, కోశాధికారిగా టీ.కుసుమకుమారి, కార్యవర్గసభ్యులుగా పద్మశ్రీ, ఏ.అప రంజి జ్యోత్స్న, నాగలక్ష్మి, ఎం.శోభలను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం కాలపరిమితి మూడేళ్లు. ఎన్నికైనవారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.ఎన్నికల నిర్వహణలో సహాయ ఎన్నికల అధికారి వీ.వెంకటకృష్ణ, పర్యవేక్షకుడు పీ.శ్రీని వాసులు, ఎన్జీవోల సంఘ ఉమ్మడి జిల్లా పూర్వపు అధ్యక్షుడు భోగరాజు, తదితరులు పాల్గొన్నారు.
బకాయిల విడుదలకు సీఎం బటన్ నొక్కాలి
ఉమ్మడి జిల్లాలోని 60 వేల మంది ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్, కార్మికుల ప్రయోజనాలు కాపా డేందుకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఉద్యోగుల,పెన్షనర్ల సమస్యల పరి ష్కారా నికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తుందని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రకటించారు. ఏళ్ల తరబడి డీఏ బకాయిలు, పెండింగ్‌లో వున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెం డర్ లీవుల బకాయిల చెల్లింపు లకు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చిస్తోన్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్య తనిచ్చి బకాయిల చెల్లిం పునకు బటన్ నొక్కాలని కోరారు. ఉద్యోగుల జేఏసీ పక్షాన పోరాటం చేపడతామన్నారు.