AP News: అన్న క్యాంటీన్‌పై దౌర్జన్యం చేస్తే సహించేది లేదు: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-08-25T23:42:49+05:30 IST

అన్న క్యాంటీన్‌ (Anna Canteen)పై వైఎస్ఆర్ గుండాలను రౌడీలను ప్రోత్సహిస్తే సహించేది లేదని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హెచ్చరించారు

AP News: అన్న క్యాంటీన్‌పై దౌర్జన్యం చేస్తే సహించేది లేదు: బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు): అన్న క్యాంటీన్‌ (Anna Canteen)పై వైఎస్ఆర్ గుండాలను రౌడీలను ప్రోత్సహిస్తే సహించేది లేదని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు హెచ్చరించారు. పేదవాడి ఆకలిని తీర్చడానికి మాజీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 2024లో ప్రజలే సీఎం జగన్‌ (CM JAGAN) ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసులు తెలిపారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం, బొడిగూడెం పంచాయతి బోడిగూడెం, అంకాలగుడెం గ్రామాల్లో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో శ్రీనివాసులు పాల్గొన్నారు. అధిక ధరలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఓ కరపత్రాన్ని ముద్రించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు మరియు కరెంట్, ఆర్టీసి చార్జీలు పెంచి జే- ట్యాక్స్ వేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, అప్పులు తప్ప అభివృద్ది లేదని విమర్శించారు. నవరత్నాలు పేరుతో నవమోసాలు చేస్తున్నారని శ్రీనివాసులు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వాడపల్లి నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు,  గ్రామ పార్టీ అధ్యక్షులు నక్కా రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పారెపల్లి రామారావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు వేమా శ్రీను,  అతిరస సంఘం రాష్ట్ర అధ్యక్షులు శుక్లబోయిన శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, నీలం నాగేశ్వరరావు, బొమ్మ రామ గంటలయ్య, రాచూరి మధన్, ఉప్పాటి వెంకట్రావు, మలిపుటీ శంకర్, మిరియాల రవి కుమార్, నిమ్మగడ్డ మహేష్, గంటా సుబ్రహ్మణ్యం, చిడిపి రవికుమార్, కూనపం సురేంద్ర,  మండల తెలుగుమహిళా అధ్యక్షురాలు ఆకుల అరుణ, తెలుగుమహిళా మండల ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి, తెలుగుమహిళా మండల మహిళా కార్యదర్శి పెండ్యాల రమాదేవి, చెరుకూరి రమ్య, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షులు రాకేష్ చందన్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

Read more