-
-
Home » Andhra Pradesh » West Godavari » anganwadi workers agitation-NGTS-AndhraPradesh
-
అంగన్వాడీల అరెస్టులు అన్యాయం
ABN , First Publish Date - 2022-03-16T05:56:32+05:30 IST
సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలను నిర్బంధించడాన్ని నిరసిస్తూ కొవ్వూరులో ధర్నా నిర్వహించారు.

కొవ్వూరు, మార్చి 15: సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలను నిర్బంధించడాన్ని నిరసిస్తూ కొవ్వూరులో ధర్నా నిర్వహించారు. కొవ్వూరు ఐసడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు బస్టాం డ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.సుందరబాబు మాట్లాడుతూ విజయవాడలో అంగ న్వాడీల నిరహార దీక్షలను పోలీసులు భగ్నం చేసి, నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం అర్హతకల్గిన వారికి గ్రేడ్–2 సూపర్‌వైజర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు వి.శ్రీదేవి, సీహెచ్.మాణిక్యాంబ, ఎంఎల్.నరసమాంబ, సీహెచ్.పుష్ప, జీవీ.రమణి, కె.లక్ష్మి, బి.బ్రహ్మమ్మ, భవాని, దుర్గామణి, మంగతాయారు, వసంత తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మంగళవారం కార్మికశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రదాన కార్యదర్శి ఎం.సుందరబాబు మాట్లాడు తూ వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను నిలిపివేసిందన్నారు. కరోనా సంక్షోభ కాలం, ఇసుక సమస్య, సిమెంట్, ఐరన్ ధరలతో సక్రమంగా పనులు సాగక కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి కార్మికునికి గుర్తింపుకార్డు అందించాలన్నారు. కార్యక్రమంలో మద్దుకూరి దొరయ్య, వీరా త్రిమూర్తులు, జొన్నల రాంబాబు, కేదార్, రేఖా నాగేశ్వరరావు, పోతురాజు, బాపిరాజు, భద్రం తదితరులు పాల్గొన్నారు.
