గొప్ప దార్శనికుడు అంబేడ్కర్
ABN , First Publish Date - 2022-12-07T00:15:23+05:30 IST
రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.
భీమవరం అర్బన్, డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం గునుపూడిలో కాంస్య విగ్రహానికి మోషేన్ రాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రంధి శ్రీనివాస్ ఇతర నాయకులు అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. టీడీపీ కార్యాలయంలో మెంటే పార్థసారధి, కోళ్ళ నాగేశ్వరరావు తదితర నాయకులు నివాళులర్పిం చారు. అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బి బలరాం, కోనాల భీమారావు, గంటా సుందర్‌కుమార్ నివాళులర్పించారు. ఏఎస్ రావు టెక్నికల్ సెంటర్‌లో వి.రాధాకృష్ణ అంబేడ్కర్ వర్ధంతి సభ నిర్వహించారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో యానాదుల కాలనీ, మాల మహానాడు ఆధ్వ ర్యంలో గునుపూడిలో పేదలకు భోజనాలు, పండ్లు అందజేశారు.
నరసాపురం టౌన్: పట్టణం, మండలంలో వివిధ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. అంబే డ్కర్ విగ్రహానికి టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు, వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సి పల్ చైర్‌పర్సన్ వెంకటరమణ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొమ్మిడి నాయకర్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, దళిత సంఘాల ఆధ్వర్వంలో అంబేడ్కర్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాలకొల్లు అర్భన్/ పాలకొల్లు టౌన్: గాంధీ బొమ్మల సెంటర్‌లో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మల రా మానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యడ్ల శివాజీ, నాయకులు, జనసేన పార్టీ నాయకులు చే గొండి సూర్యప్రకాష్, వైసీపీ ఆధ్వర్యంలో చందక సత్తిబాబు, కోరాడ శ్రీని వాసరావు, తదితరులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కపర్ధి అం బేడ్కర్ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. త హసీల్దార్ కార్యాలయం, ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.