సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి

ABN , First Publish Date - 2022-08-18T05:48:34+05:30 IST

వెదజల్లే పద్ధతిలో కలుపు పెరుగుతుందని, నివారించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో ప్రియాంక సూచించారు.

సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
సిద్ధాపురంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో రైతులు

ఆకివీడు రూరల్‌, ఆగస్టు 17: వెదజల్లే పద్ధతిలో కలుపు పెరుగుతుందని, నివారించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో ప్రియాంక సూచించారు. ఆకివీడు మండలం సిద్ధాపురంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు సూచనలు ఇచ్చారు. వరి నాటిన వారం రోజులలోపు యూరియా 35 కిలోలు, 25 కిలోల డీఏపీ, 20 కిలోల ఎంవోపీలను వేసుకోవాలని తెలిపా రు. మిత్ర కీటకాలు సంరక్షణ చేపట్టాలన్నారు. ఈ క్రాప్‌ నమోదును త్వరితగతిన చేపట్టాలని కోరారు. వీఎవో రవితేజ, ఆర్‌బికె చైర్మన్‌ గాంధీరాజు, అల్లూరి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:48:34+05:30 IST