ప్రస్తుతం వరి కోతలు వద్దు

ABN , First Publish Date - 2022-12-10T00:02:36+05:30 IST

తుఫాన్‌ ప్రభావం తగ్గేవరకూ రైతు లు వరి కోతలు వద్దని ఏడీఏ అనిల కుమారి రైతులకు సూచించారు.

ప్రస్తుతం వరి కోతలు వద్దు
అత్తిలి మండలంలో ధాన్యం రాశలు పరిశీలిస్తున్న తహసీల్దార్‌

మొగల్తూరు / అత్తిలి, డిసెంబరు 9: తుఫాన్‌ ప్రభావం తగ్గేవరకూ రైతు లు వరి కోతలు వద్దని ఏడీఏ అనిల కుమారి రైతులకు సూచించారు. ఆర్‌బీకేలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో అమె మాట్లాడారు. ఇప్పటికే కోసిన పనలు చేల్లో ఉంటే తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. తుఫాన్‌ పరిస్ధితులను అంచనా వేసుకుని రైతులు మాసూళ్ళు చేయాలని, రాశులుగా వేసిన ధాన్యాన్ని తడిసిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్‌ తీరం దాటిన తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఆర్‌సి ఆనంద్‌ కుమార్‌, వ్యవసాయ సలహ మండలి సభ్యులు గూడూరి మావుళ్ళు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో చేలను తహసీల్దార్‌ ఏవీ రామాంజనేయులు, ఏవో టీకే రాజేష్‌ పరిశీలించారు. ఉరదాళ్లపాలెంలో రాశులుగా ఉంచి ధాన్యాన్ని పరిశీలించి బరకాలు కప్పి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నందున కోతకు వచ్చిన వరి చేలను కోయవద్దని సూచించారు. నిల్వ ఉన్న ధాన్యం రాశులను వెంటనే సంచులలో నింపి తరలించాలని సూచించారు.

Updated Date - 2022-12-10T00:02:36+05:30 IST

Read more