తాగు నీటి కోసం.. నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2022-07-06T05:40:33+05:30 IST

పెద కాపవరంలో మూడు నెల లుగా తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.

తాగు నీటి కోసం.. నిరాహార దీక్ష
అధికారులకు త్రాగునీరు బాటిల్స్‌ చూపిస్తున్న ఎమ్మెల్యే రామరాజు

ఆకివీడు రూరల్‌ జూలై 5 : పెద కాపవరంలో మూడు నెలలుగా తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కుళాయిల ద్వారా వచ్చే నీరు పచ్చ రంగుతో, దుర్వాసన వెదజల్లు తోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీనిపై టీడీపీ నేత తోట ఏడుకొండలు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.వాటర్‌ ప్లాంట్‌ ద్వారా నీటిని పంపిణీ చేయకపోవ డంతో ఇతర గ్రామాలకు వెళ్లి నీటిని కొనుక్కుని తెచ్చుకుంటున్నా మని, టీ తాగుతున్నట్లు నీటిని తాగాల్సిన దుస్థితి వచ్చిందని ఏడు కొండలు వాపోయారు. దీక్ష శిబిరాన్ని, తాగునీటి చెరువును ఉండి ఎమ్మెల్యే మంతెన రామ రాజు పరిశీలించారు. మంచినీటి చెరువు లో నీటిని బయటకు తోడి వేసి, నీటిని నింపాలని, మూడు రోజుల లో పనులు పూర్తిచేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందజేయాలని అధికా రులను ఆదేశించారు. లేకుంటే తానే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. దీనిపై ఎంపీడీవో శ్రీకర్‌, కార్యదర్శి నారాయణరావు హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. లంబాడి రామాంజనేయులు, కూన నాగేశ్వరరావు, కఠారి గెరటయ్య, కొల్లి రమేష్‌, మంచాల సత్యనారాయణ దీక్షలో పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:40:33+05:30 IST