ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

ABN , First Publish Date - 2022-03-05T06:28:18+05:30 IST

విద్యుత్‌ మీటరు బిగించేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దెందులూరు ఏపీఈపీడీసీఎల్‌ దెందులూరు సెక్షన్‌ ఏఈ కూచిపూడి శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
చిక్కిన ఏఈ కూచిపూడి శ్రీనివాస్‌

దెందులూరు/ఏలూరు క్రైం, మార్చి 4 : విద్యుత్‌ మీటరు బిగించేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దెందులూరు ఏపీఈపీడీసీఎల్‌ దెందులూరు సెక్షన్‌ ఏఈ కూచిపూడి శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముప్పవరానికి చెందిన గొల్లపల్లి గంగరాజు అనే రైతు తన చేపల చెరువుకు కమర్షియల్‌ విద్యుత్‌ మీటర్‌ను బిగించేందుకు ఏఈని సంప్రదించారు. దరఖాస్తు చేసుకుని ఎన్నో రోజులుగా తిరుగుతున్నా పనికావడం లేదు. చివరకు రూ.50 వేలు ఇస్తే కనెక్షన్‌ ఇస్తానని ఏఈ డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. వారి సూచనల మేరకు అనుకున్న మొత్తాన్ని శుక్రవారం ఏఈకి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరోవైపు ఏలూరులోని ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు రాత్రి సోదాలు చేపట్టారు.  

Read more