కోటలు దాటిన కబుర్లు

ABN , First Publish Date - 2022-11-24T01:14:54+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాగితాల మీద కాకి లెక్కలు వేస్తూ ఆచరణలో తుస్సుమనిపిస్తోంది.

కోటలు దాటిన కబుర్లు

అంతన్నారు.. ఇంతన్నారు

ఎక్కడికక్కడ గాలిలో మేడలు

నిధులు ప్రకటించినా ఫలితాలెక్కడ

సచివాలయ, భరోసా భవనాలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ

క్లినిక్‌లకు స్థలాలే లేవు.. డిజిటల్‌ ఎప్పుడో మాయం.. అరకొర సమీక్షలు.. ఫలితాలు బేజారు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాగితాల మీద కాకి లెక్కలు వేస్తూ ఆచరణలో తుస్సుమనిపిస్తోంది. పైపైన మెరుగులెన్నో. కానీ సమీక్షల్లో వెనుకంజ. ఆచరణలో అంతా తూచ్‌.. అంతన్నారు.. ఇంతన్నారు.. కాని ఏ ఒక్కటీ సకాలంలో పూర్తి కాని వైనం. బహిరంగ వేదికల మీద మాత్రం అన్నీ బడాయిలే. గ్రామ సచివాలయ భవ నాలు, రైతు భరోసా కేంద్రా లు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌, బల్క్‌ మిల్క్‌ సెంటర్స్‌, డిజి టల్‌ లైబ్రరీలు, వైఎస్సార్‌ జలకళ.. ఇలా ఒకటేంటి ఎన్నో చేశామన్నట్టు ఎక్కడి కక్కడ తెగ ఊదరగొట్టారు. ప్రకటించిన నిధులకు, మంజూరవుతున్న నిధులకు పొంతనే లేదు. వీటన్నిటికీ లెక్కలు కట్టి పూర్తి చేశామ న్నట్టుగా తెగ మేకప్‌లు. కనీసం శిలాఫలకానికే దిక్కు లేదు. కొన్ని పథకాలు ఫిఫ్టీ.. ఫిఫ్టీ. ఇంకొన్ని ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఈ మాత్రం దానికి సర్కార్‌ మాత్రం బోల్డన్ని గొప్పలు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఓ వైపు ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి బటన్‌ నొక్కుడు కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల చెంతకు కోట్లు చేరుస్తున్నామంటూ బహిరంగ వేదికలపై ఊదర గొడు తున్నారు. మరోవైపు అనేక పథ కాలకు రూపకల్పన చేసి, మరికొన్నింటికి అన్నీ సమకూర్చేశామన్నట్టు తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. వాస్తవ కోణంలో దీనికి అను వైన సంతృప్తికర పరిస్థితులు లేవు. ఎమ్మె ల్యేలను తలదన్నే విధంగా, జిల్లా యం త్రాంగానికి సమాంతరంగా గ్రామ సచివా లయాలను అమలులోకి తెచ్చారు. వీటికి సొంత భవనాలు నిర్మించేందుకు కార్యాచ రణ ప్రకటించారు. ఒక్క ఏలూరు జిల్లా లోనే రూ.205 కోట్లతో 532 గ్రామ సచివా లయాల భవనాలను నిర్మించాలని హడా వుడి చేసేశారు. ఇప్పటికి నిర్మించిన భవ నాలు 287. చేసిన ఖర్చు రూ.100 కోట్లకు లోబడే. ఆ తరువాత నిర్మాణాల పురోగ తిపై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సమీక్షలు చేసిందే లేదు. సచివాలయాల భవనాల నిర్మాణానికి కావాల్సిన నిధులు ముందస్తుగానే విడుదల చేసినట్టు చెబు తున్నా, కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడం ప్రారంభించారు. కారణం నిధులు పుష్క లంగా అందకపోవడమే. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా మాయే చేస్తున్నారు.

భరోసా బబ్బుంది

క్షేత్రస్థాయిలో రైతులకు కావాల్సిన పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఇలా అన్నీ రైతుభరోసా కేంద్రాల్లోనే అంటూ తెరముందుకు తెచ్చింది. ఏలూరు జిల్లాలో 500లకుపైగానే గుర్తించిన చోట్ల ఆర్‌బీకేలను నిర్మించాలని తలపెట్టింది. వీ టికి వంద కోట్లకుపైగానే కేటాయి స్తున్న ట్టు చెప్పింది. మరుసటి సీజన్‌ వచ్చే నాటి కి అందమైన కేంద్రాలు మీ ముందుంటా యి. అది మీ సేవలోనే అంటూ వైసీపీ ఊదర గొట్టేసింది. తీరా ఎక్కడెక్కడ కట్టారని ఆరా తీస్తే వీటి సంఖ్య 200లకే చేరుకుంది. దీని నిమిత్తం చేసిన ఖర్చు రూ.40 కోట్లలోపే. ఇంత జరిగితే అసలు పూర్తిగా భరోసా కేంద్రాలకు అవసరమైన సొంత భవనాలు ఎప్పటిలోపు పూర్తవుతా యో కూడా చెప్పలేని పరిస్థితి. సచివాల యాల మాదిరిగానే ఇక్కడ ఫిఫ్టీ.. ఫిఫ్టీ. మంత్రులు, సీఎం జగన్‌కు సన్నిహిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ భరోసా బోల్తా కొట్టింది. కొన్నిచోట్ల భవన నిర్మాణ పనులు ప్రారంభించకుండానే బొబ్బుంది.

ఇక ప్రజారోగ్యమే తమ కర్తవ్యమంటూ సర్కార్‌ ఎక్కడ లేని మేకప్‌ ఇచ్చింది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభిస్తామని, వీటికి సొంత భవనాలు నిర్మిస్తామని, తగిన వైద్య సిబ్బందిని అందుబాటు లో ఉంచుతామని ప్రజలను బోల్తా కొట్టించింది. ఈ హెల్త్‌ క్ల్లినిక్‌లు అందుబాటులోకి వస్తే ఇక ప్రజారోగ్యానికి తిరుగులేద నుకున్నారంతా. కాని, ఓ వైపు సొంత భవనాలు సమకూర్చడం లోనే బోల్తా కొట్టేశారు. మరో వైపు ప్రజలకు అనువైన వైద్యం అందిస్తామనే జగన్‌ వరం కాస్తా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. సుమారు 424 పైగానే వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించేందు కు వీలుగా రూ.74 కోట్లు కేటా యించినట్టు ప్రకటించారు. వీటి లో నాలుగో వంతు పూర్తి కాలేదు. కొన్ని టికీ స్థలం అందుబాటులో లేకపోగా మరి కొన్నింటిని చూసీ చూడనట్టు వదిలేశారు. ఇప్పటికే పూర్తయినట్టు ప్రభుత్వం ప్రక టిస్తున్న క్లినిక్‌లకు ఇంకా తాళాలే వేలాడు తున్నాయి. ఇదేమని ప్రశ్నించడానికి ఎమ్మెల్యేలకు ధైర్యం చాలడం లేదు. ఆర్ధిక ఇబ్బందులంటూ ఇప్పటికే సన్నాయి నొక్కు ళ్ళు నొక్కుతున్నారు. కాని వీటికి సొంత భవనాలే కాదు ఆచరణలో తగిన వైద్యం అందించేందుకు వీలుగా అవసరమైన సిబ్బంది, వైద్యుల నియామకాలను ఇప్ప టికీ పూర్తి చేయలేకపోయారు. ఒకవైపు ప్రాధమిక వైద్య శాలలు అందుబాటులో ఉంటే వాటిని బలోపేతం చేయాల్సింది పోయి మళ్ళీ వాటికి సమాంతరంగా ఈ ్జక్లినిక్‌లను తెరముందుకు తెచ్చి ఇప్పటికే ఫోజులు కొట్టేశారు. ఆచరణలో ఎదురవు తున్న ఆటంకాలను అధిగమించలేక ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.

సమీక్షలు.. సమాచారం లేదు

ఒకప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రకటించే పథకాలన్నింటికీ బహుళ ప్రాచుర్యం లభించేది. జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారిక సమీ క్షలు. తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కాంట్రా క్టర్లు, అధికారులను పరుగులు పెట్టించే వారు. నిధుల కొరత ఏర్పడితే కలెక్టర్లే కలుగ చేసుకుని ఆసాంతం పరిష్కరించే వారు. ఆర్ధిక శాఖతో సంప్రదింపులు జరిపేవారు. అసలు విషయాన్ని ప్రభుత్వా నికి చేరవేసే వారు. మరి ఇప్పుడో... ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై ఎప్పుడో ఒకసారి తూతూమంత్రం సమీక్షలు. వీటి అమలు కోసం ప్రత్యేక క్యాలెండర్‌ అంటూ లేదు. నిధుల కొరత ఎదురైనా, లేకపోతే పనులు మందకొడిగా సాగినా, జరిగిన పనుల్లో లోపాలపై ఫిర్యాదులు వచ్చినా అప్రమత్తం కావడానికి అనువైన యం త్రాంగం ఉన్నా స్పందన మాత్రం లేదు. సచివాలయ, రైతు భరోసా, వైఎస్సార్‌ క్లినిక్‌ భవనాలతోపాటు డిజిటల్‌ లైబ్రరీలే ఇందుకు ఉదాహరణ. వీటిపై కార్యాచరణ కొనసాగుతుందన్న విషయం అత్యధికులైన ప్రజా ప్రతినిధులకు తెలిస్తే ఒట్టు.

ఏవీ లైబ్రరీలు

ఒక కొత్త కలల ప్రపంచం చూపించేలా వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే అనేక ప్రకట నలు, మరెన్నో విధానాలు. ఆ క్రమంలో పుట్టినవే వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీలు. ఇంకేముంది డిజిటలైజేషన్‌ అందుబాటులోకి వచ్చి సాంకేతిక సహకారంతో మీ ముందే ప్రపంచం అన్నట్టు ఎక్క డికక్కడ ప్రకటనలు గుప్పించారు. అనుకున్నట్టుగానే జిల్లావ్యాప్తంగా 132కు పైగా లైబ్రరీలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు వీటి కోసం రూ.21 కోట్లు. కాని ఎక్కడా డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తే ఒట్టు. ప్రకటించిన లైబ్రరీలన్నీ కాగితాలకే పరిమితం. ఇదేదీ పైకి పొక్కకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - 2022-11-24T01:14:54+05:30 IST

Read more