హెచ్‌టీ లైన్లు వద్దంటూ కిరోసిన్‌ డబ్బాతో హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-01-13T06:01:20+05:30 IST

నివాస గృహాల మీదుగా హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు ఆపాలంటూ ద్వారకాతిరుమల ఎస్సీ కాలనీలో ఒక వ్యక్తి ఆత్మాహుతి చేసుకుంటానని కిరోసిన్‌ డబ్బాతో బుధవారం హల్‌చల్‌ చేశాడు.

హెచ్‌టీ లైన్లు వద్దంటూ కిరోసిన్‌ డబ్బాతో హల్‌చల్‌

ద్వారకాతిరుమల, జనవరి 12 : నివాస గృహాల మీదుగా హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు ఆపాలంటూ ద్వారకాతిరుమల ఎస్సీ కాలనీలో ఒక వ్యక్తి ఆత్మాహుతి చేసుకుంటానని కిరోసిన్‌ డబ్బాతో బుధవారం హల్‌చల్‌ చేశాడు. దీంతో ఎస్సీ కాలనీ లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్ళపై నుంచి హైటెన్షన్‌ లైన్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నాలో ఈ ఘటన జరిగింది. వెంకట కృష్ణాపురంలో నిర్మించిన 132/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి కోడిగూడెం వరకూ వేస్తున్న విద్యుత్‌లైన్ల వల్ల భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకితో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బాధితుల్ని కలసి ఎస్సీ కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా  లైన్లను మార్చేందుకు కృషి చేస్తామన్నారు. 

Updated Date - 2022-01-13T06:01:20+05:30 IST