విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-12-16T23:49:35+05:30 IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా మునుగూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మక్కువ: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా మునుగూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం.. తూరుమామిడి గ్రామానికి చెందిన సిరికి గోపాలరావు (25) ఉపాధి నిమిత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్లి ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఇంట్లో వాషింగ్‌మిషన్‌లో బట్టలు వేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి తల్లి, సోదరుడు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:49:37+05:30 IST