‘యువత బంగారు భవిష్యత్తుకు కృషి’

ABN , First Publish Date - 2022-12-15T23:43:30+05:30 IST

యువత కు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తోందని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి లోకం మాధవి తెలిపారు.

‘యువత బంగారు భవిష్యత్తుకు కృషి’

భోగాపురం: యువత కు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు జనసేన పార్టీ కృషి చేస్తోందని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి లోకం మాధవి తెలిపారు. ముంజేరు సమీప మిరాకిల్‌ కళాశాలలో గురువా రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతకు ఐటీ రంగంలో శిక్షణ ఇస్తున్నామ ని చెప్పారు. పోలీసు ఉద్యోగాలకు అవసరమైన మెటీరియల్‌ తీసుకొచ్చి, ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇప్పించి, నియోజకవర్గంలో 500 మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా చేయడమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. వచ్చేనెల 12న యువశక్తి కార్యక్రమానికి పవన్‌కల్యాణ్‌ రానున్నారని ఆమె వెల్లడించారు. నియోజకవర్గంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:43:32+05:30 IST