మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-03-06T05:27:16+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ దీపికాపాటిల్‌ పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో శనివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మహిళలు అన్ని రంగాల్లో  రాణించాలి
యూతిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

  ఎస్పీ దీపికాపాటిల్‌ 

విజయనగరం రూరల్‌, మార్చి 5: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ దీపికాపాటిల్‌ పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో శనివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పలు రంగాల్లో ఇప్పటికే మహిళలు పురుషులతో సమానంగా అవకా శాలను అందిపుచ్చుకుని దూసుకెళ్తున్నారన్నారు. విద్యార్థినులు దిశా యాప్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. చదువుతున్న సమయంలోనే  భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించి,  ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు.  మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి మహిళా స్వశక్తితో ఎదిగి, ఆర్థి కంగా స్థిరపడాలన్నారు. ఎటువంటి సమస్యనైనా  మానసిక ధైర్యంతో ఎదుర్కోవాలని తెలిపారు.  జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ జి.స్వామి నాయుడు మాట్లాడుతూ.. గతంతో పోల్చితే మహిళలు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అంతక ముందు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘యూతిక’ పుస్తకాన్ని ఆవిష్క రించారు.  కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్యామలరావు, జి.జయ సుమ, ఎం.హేమ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-03-06T05:27:16+05:30 IST