నకిలీ పత్రాలతో..
ABN , First Publish Date - 2022-12-16T23:59:49+05:30 IST
నకిలీ పత్రాలు చూపించి ఆరు లక్షలు విలువ చేసే మొక్కజొన్న పంటను కాజేయాలనుకున్న దొంగల ముఠా గుట్టును చీపురుపల్లి పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ గోరు సంజీవరావు, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నకిలీ పత్రాలతో..
రూ.6 లక్షల మొక్కజొన్న పంటతో పరారీ
బాధితుడితో ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల అరెస్ట్
సరుకు స్వాధీనం
చీపురుపల్లి, డిసెంబరు 16: నకిలీ పత్రాలు చూపించి ఆరు లక్షలు విలువ చేసే మొక్కజొన్న పంటను కాజేయాలనుకున్న దొంగల ముఠా గుట్టును చీపురుపల్లి పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ గోరు సంజీవరావు, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలం కరకాం గ్రామానికి చెందిన అచ్యుతరామరాజు అనే వ్యాపారి మెట్టపల్లి పరిసర ప్రాంతాల్లో రూ.6 లక్షల విలువచేసే మొక్కజొన్న పంటను కొనుగోలు చేశాడు. ఆ సరుకును అనపర్తిలోని ఈశ్వరరెడ్డి పౌలీ్ట్రకి చేర్చాల్సి ఉంది. ఈ మేరకు శ్రీకాకుళంలోని లారీ సప్లయ్ కార్యాలయంతో మాట్లాడి.. బాడుగకు కుదుర్చుకున్నారు. నవంబరు 24న శ్రీకాకుళంలోని లారీ సప్లయ్ కార్యాలయం నుంచి వచ్చిన ఏపీ 31 క్యూయూ 4933 నంబరు గల లారీ సరుకును లోడ్ చేసుకొనేందుకు మెట్టపల్లికి చేరింది. అయితే మొక్కజొన్న పంటను కాజేయడంలో అనుభవంతో బాటు పలు నేరాలతో సంబంధం ఉన్న రాజోలు ప్రాంతానికి చెందిన డి. మణికంఠవర్మ, అమరావతిలోని దిడుగు ప్రాంతానికి చెందిన డ్రైవర్ ఆర్.లక్ష్మీనారాయణ, తాడేపల్లిగూడేంకు చెందిన క్లీనర్ మణకంఠ రమేష్‌బాబులు నకిలీ పత్రాలు, చూపించి సరుకును లారీలో లోడ్ చేసుకున్నారు. అదే రోజున అనపర్తికి వెళ్తున్నామని చెప్పి మెట్టపలిల్లి నుంచి సరుకుతో బయల్దేరారు. అయితే వీరు విశాఖ జిల్లా నక్కపల్లి చేరే వరకూ స్థానిక వ్యాపారి అచ్చుతరామరాజుతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. అటు తరువాత ముగ్గురి ఫోన్లు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి అనపర్తిలోని వ్యాపారికి ఫోన్ చేయగా సరుకు రాలేదని చెప్పారు. దీంతో ఈ నెల 5న అచ్చుతరామరాజు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోని దిగిన పోలీసులు మొబైల్ ఫోన్లు, లారీ నంబరు కూడా నకిలీవిగా గుర్తించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఎట్టకేలకు గురువారం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అప్పటికే అనపర్తి చేరాల్సిన మొక్కజొన్న పంటను నిందితులు గుంటూరులోని వేరే సంస్థకు విక్రయించినట్టు గుర్తించిన పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాకుండా కొనుగోలుదారుల్ని అప్రమత్తం చేశారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ సన్యాసినాయుడు, పీసీలు భాను, జగదీష్‌లను సీఐ సంజీవరావు అభినందనలు తెలిపారు.