‘కబ్జాలను బయటపెడతాం’

ABN , First Publish Date - 2022-11-18T23:55:15+05:30 IST

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కబ్జాలను బయటపెడతామని జనసేన నాయకులు అనిల్‌కుమార్‌, దాలినాయుడు, కరుణ, రాంబాబులు హెచ్చరించారు.

‘కబ్జాలను బయటపెడతాం’

పార్వతీపురంటౌన్‌: అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కబ్జాలను బయటపెడతామని జనసేన నాయకులు అనిల్‌కుమార్‌, దాలినాయుడు, కరుణ, రాంబాబులు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి స్థానిక జనసేన పార్టీ కార్యాలయం లో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బెలగాం బూరాడ వీధిలో పార్టీ తరఫున సందర్శించామని చెప్పారు. దీనిలో భాగంగా మున్సిపాల్టీకి చెందిన సామూహిక మరుగుదొడ్ల స్థలం ఎక్కడ ఉందని స్థానికులను అడిగామన్నారు. ఆ సమయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ భర్త ఆదినారాయణ ‘మీకు ఇక్కడేం పని, ప్రభుత్వ స్థలాలపై మీరెవరూ ఆరా తీయడానికి’ అని తమపై దాడికి దిగడం ఎంత వరకు సమంజసమన్నారు. దీనిపై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. కలెక్టర్‌, ఎస్పీ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చైర్‌పర్సన్‌ భర్త నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వారు కోరారు.

Updated Date - 2022-11-18T23:55:15+05:30 IST

Read more