గురుదేవ ఆసుపత్రికి సాయం అందిస్తాం

ABN , First Publish Date - 2022-12-06T23:57:26+05:30 IST

మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్‌ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న సేవలు చాలా బాగున్నాయని, అందుచేత తమ సంస్థద్వారా మరిన్ని సేవలు అందిస్తామని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఐడీబీఐ సంస్థ డీజీఎం తోట విద్యా సాగర్‌ అన్నారు.

గురుదేవ ఆసుపత్రికి సాయం అందిస్తాం

కొత్తవలస: మంగళపాలెంలోని గురుదేవ చారిటబుల్‌ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న సేవలు చాలా బాగున్నాయని, అందుచేత తమ సంస్థద్వారా మరిన్ని సేవలు అందిస్తామని హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఐడీబీఐ సంస్థ డీజీఎం తోట విద్యా సాగర్‌ అన్నారు. మంగళవారం తమ సంస్థ అందించిన డిజిటల్‌ ఎక్సురే, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌, అనస్థీషియా వర్కు స్టేషన్‌ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలతో పాటు, ప్రస్తుతం పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ సేవలను విస్తరిస్తున్న ట్రస్టుకు భవిష్యత్తులో తమ వంతుగా మరిన్ని పరికరాలను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా 30 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, 100 మంది పేదలకు ఉచితంగా రేషన్‌ ఆయన చేతులుమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ జగదీష్‌బాబు, ఆసుపత్రి కమిటీ సభ్యులు రామయ్య, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:57:28+05:30 IST