Vizainagaram: రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం

ABN , First Publish Date - 2022-10-07T20:53:53+05:30 IST

రవాణా శాఖలో లక్కీ లాటరీ (Lucky lottery) టికెట్ల (tickets) వివాదం నెలకొంది.

Vizainagaram: రవాణా శాఖలో లక్కీ లాటరీ టికెట్ల వివాదం

విజయనగరం (Vizainagaram): రవాణా శాఖలో లక్కీ లాటరీ (Lucky lottery) టికెట్ల (tickets) వివాదం నెలకొంది. పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ చిహ్నంతో అధికారులు లాటరీ టిక్కెట్లు ముద్రించారు. మూడు బహుతులు ప్రకటించారు. ఒక్కో టికెట్ ధర రూ.100లుగా నిర్ణయిస్తూ.. వలంటీర్ల ద్వారా విక్రయించేందుకు నిర్ణయించారు. అయితే జిల్లా అధికారులే లాటరీ టిక్కెట్లు పేరుతో వ్యాపారం చెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే టికెట్స్ అమ్మకాలను రద్దు చేశారు.

Updated Date - 2022-10-07T20:53:53+05:30 IST