సంచలనం.. : శుభలేఖ ఇవ్వడానికి వచ్చామని తలుపు తట్టి లోపలికెళ్లారు.. నీళ్లు తేవడానికి వెళ్లిన మహిళ.. ఇంతలోనే..!

ABN , First Publish Date - 2022-05-23T15:03:22+05:30 IST

శుభలేఖ ఇవ్వడానికి వచ్చామని తలుపు తట్టి లోపలికెళ్లారు.. నీళ్లు తేవడానికి వెళ్లిన మహిళ.. ఇంతలోనే..!

సంచలనం.. : శుభలేఖ ఇవ్వడానికి వచ్చామని తలుపు తట్టి లోపలికెళ్లారు.. నీళ్లు తేవడానికి వెళ్లిన మహిళ.. ఇంతలోనే..!

విజయనగరం జిల్లా/రాయగడ: శుభలేఖ (Wedding Card) పేరిట వచ్చిన దుండగులు దోపిడికి ప్రయత్నించిన ఘటన పట్టణంలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు (Police) బాధితులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కాలేజీ రోడ్డులో ఉంటున్న వ్యాపారి జగన్నాథ మహంతి ఇంటికి శనివారం సాయంత్రం  ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు శుభలేఖ ఇవ్వడానికి వచ్చామని తలుపు తట్టడంతో మహంతి భార్య జ్యోతి తలుపు తీశారు. మంచి నీరు కావాలని అడగడంతో జ్యోతి వంటింట్లోకి నీరు తేవడానికి వెళ్లగా ఆమె వెనుకనే వెళ్లిన దుండగులు ఆమెను తాళ్లతో బంధించి దోపిడికి యత్నించారు. వేరే గదిలోనుంచి వచ్చిన కుమారుడు ప్రీతమ్‌ను కొట్టి బాత్రుమ్‌లోని (Bothroom) నెట్టి వేశారు. మరో గదిలో ఉన్న కుమార్తె చాందిని బయటకు రావడంతో ఆమెను మెడపై కత్తి ఉంచి బెదిరించారు. అయినప్పటికీ ఆమె తప్పించుకుని కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఈ హడావిడిలో వారు తమతో తెచ్చిన బ్యాగును (Bag) బాధితుని ఇంట్లో వదిలి వేశఆరు. అందులో తాళ్లు, కత్తులు, నోటికి అంటించే ప్లాస్టర్లు వంటివి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుని ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటి సీసీ కెమెరాల్లో పుటేజీని తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more