పొట్టి శ్రీరాములుకు నివాళి

ABN , First Publish Date - 2022-12-16T00:01:54+05:30 IST

ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతి అజరామరమని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు.

పొట్టి శ్రీరాములుకు నివాళి
నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, డిసెంబరు 15: ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతి అజరామరమని కలెక్టర్‌ సూర్యకుమారి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్‌వో గణపతిరావు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీవో బాలాజీ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:01:56+05:30 IST