మూడు పూరిళ్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-01-13T05:39:02+05:30 IST

కొనిస గ్రామంలో మంగళ వారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యా యి.

మూడు పూరిళ్లు దగ్ధం

గజపతినగరం, జనవరి 12: కొనిస గ్రామంలో మంగళ వారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యా యి. గ్రామానికి చెందిన మామిడి రమణ ఇంట్లో విద్యుత్‌ వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగా యి. దీంతో చుట్టుపక్కలగల పసగల చినరామ్‌, సుదలక్ష్మణరావుల ఇళ్లకు మంట లు వ్యాపించాయి. మూడు పూరిళ్లు కాలి బూడిదయిపోయాయి. గ్రామస్థుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి కె.అప్పారావు సిబ్బంది సహాయంతో వచ్చి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.లక్షా50వేలు ఆస్తి నష్టం సంభవించవచ్చునని ప్రాథమిక అంచనా.

Updated Date - 2022-01-13T05:39:02+05:30 IST