చెట్టు మీదనుంచి జారిపడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-03-05T05:38:23+05:30 IST

చెట్టుమీద నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొండగంగుబూడిలో శుక్రవారం చోటుచేసుకుంది.

చెట్టు మీదనుంచి జారిపడి యువకుడి మృతి

వేపాడ: చెట్టుమీద నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొండగంగుబూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్‌ కనకరాజు(31) గురువారం సాయంత్రం చింత చెట్టు ఎక్కి చింత బొట్టలు దులుపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కనకరాజును ఎస్‌.కోటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసిన వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కి రిఫర్‌ చేశారు. గత్యంతరం లేని కనకరాజు కుటుంబ సభ్యులు ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వెద్యులు 108 వాహనం ద్వారా విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవుతుండగా కనకరాజు మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కనకరాజుకు భార్య దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Updated Date - 2022-03-05T05:38:23+05:30 IST