చెడు అలవాట్లుకు బానిసగా మారి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-07T06:20:37+05:30 IST

మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన అల్లు అప్పారావు(28) కొంతకాలంగా చెడు అలవాట్లుకు బానిసగా మారి వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చెడు అలవాట్లుకు బానిసగా మారి యువకుడి ఆత్మహత్య

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన అల్లు అప్పారావు(28) కొంతకాలంగా చెడు అలవాట్లుకు బానిసగా మారి వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన అప్పారావు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. ఒకసారి ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకబోగా స్థానికులు రక్షించారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని కల్లాల్లో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి అర్జునమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. 

 

Read more