హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2022-12-07T00:10:05+05:30 IST

ఎస్పీకి జ్ఞాపిక అందజేస్తున్న హోంగార్డులు

హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
ఎస్పీకి జ్ఞాపిక అందజేస్తున్న హోంగార్డులు

ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ దీపికాపాటిల్‌

విజయనగరం క్రైం, డిసెంబరు 6: పోలీసు వ్యవస్థలో హోంగార్డులు ఒక భాగమని, పోలీసులతో సమానంగా అన్ని విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తోడ్పాటు అందిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని ఎస్పీ దీపికాపాటిల్‌ అన్నారు. 60వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై హోంగార్డు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, హోంగార్డులు బందోబస్తు విధుల నుంచి ముఖ్యవ్యక్తుల భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ తదితర అనేక అంశాల్లో సమర్థంగా పనిచేస్తున్నారన్నారు. వారి సేవలకు గుర్తింపుగా ముగ్గురు హోంగార్డులకు అతి ఉత్క్రష్ట, 13 మందికి ఉత్కృష్ట పథకాలను అందించామన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేందుకు కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటు చేశామన్నారు. మెటర్నటీ లీవ్‌ మూడు మాసాలు, ప్రమాదాలు, విధుల్లో మరణించిన హోంగార్డులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో, వివాహ రుణాలు, మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామన్నారు. ఎప్పటిలా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సహాయకారిగా మెలగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసాపత్రం అందించారు. అనంతరం హోంగార్డులు జిల్లా పోలీసు కార్యాలయంలో నుంచి అ

Updated Date - 2022-12-07T00:11:38+05:30 IST