బైకును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2022-03-06T05:13:22+05:30 IST

లారీ, బైకు ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నద మ్ములు తీవ్ర గాయాలపాలు కాగా, అన్న చికిత్స పొందుతూ మృతిచెందా డు.

బైకును ఢీకొన్న లారీ

 అన్న మృతి, తమ్ముడికి గాయాలు

బొండపల్లి, మార్చి 5: లారీ, బైకు ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నద మ్ములు తీవ్ర గాయాలపాలు కాగా, అన్న చికిత్స పొందుతూ మృతిచెందా డు. ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ని అంబటివలస గ్రామానికి చెందిన నిమ్మాది నాగరాజు (35) తన ద్విచక్ర వాహనంపై రోజువారీలాగే విజయనగ రంలోని టైల్స్‌ అతికించే పని నిమిత్తం తన తమ్ముడు వినయ్‌తో కలిసి వెళ్తున్నాడు. గొట్లాం గ్రామానికి సమీపంలో బైపాస్‌ రోడ్డు వద్దకు వచ్చేసరికి, విజయనగరం వైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బైకు లారీ కిందకు వెళ్లి నుజ్జునుజ్జు కాగా, నాగరాజు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. వెనుక కూర్చున్న వినయ్‌కు గాయాల య్యాయి. గాయపడిన ఇద్దరినీ 108 వాహనంలో విజయనగరంలోని మహరాజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. ప్రస్తుతం వినయ్‌ పరిస్థితి భాగానే ఉంది. నాగరాజు మృత దేహాన్ని శవపంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  నాగరాజుకు భార్య లావణ్య తోపాటు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 

 

Read more