సమగ్రాభివృద్ధే లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-06T05:24:05+05:30 IST

జిల్లాలోని సచివాలయ స్థాయిలో సమీక్షలు జరిపి, కీలక అంశాల్లో సుస్థిర సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ సూర్య కుమారి సూచించారు.

సమగ్రాభివృద్ధే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

  పిల్లల్లో రక్తహీనత నివారణకు చర్యలు 

  అధికారుల సమీక్షలో  కలెక్టర్‌ సూర్యకుమారి 

కలెక్టరేట్‌, మార్చి 5 : జిల్లాలోని సచివాలయ స్థాయిలో సమీక్షలు జరిపి, కీలక అంశాల్లో సుస్థిర సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేయాలని  కలెక్టర్‌ సూర్య కుమారి సూచించారు. అక్షరాస్యత పెంచడం , డ్రాపౌట్స్‌ తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.  శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  పిల్లల్లో రక్త హీనత సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.  పాఠశాల, అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఉన్న పిల్లలకు ప్రతినెలా హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి బుధవారం ఇమ్యునైజేషన్‌డే జరపాలని సూచించారు. రక్తహీనతను తగ్గించడానికి ఐరన్‌, పోలిక్‌ మాత్రలు ఇవ్వాలన్నారు. బలవర్థక ఆహారాన్ని తీసుకునేలా అవ గాహన కల్పించాలని చెప్పారు. పీహెచ్‌సీలు, అంగన్‌వాడీ కేంద్రాల గోడలపై బల వర్థక ఆహారపు అలవాట్లపై పెయింటింగ్‌  వేయించాలని ఆదేశించారు.  జిల్లా సమాఖ్య , మహిళా సమావేశాల్లో కూడా రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడేలా అజెండాలో పెట్టాలని చెప్పారు.  సమావేశంలోని జేసీలు కిషోర్‌ కుమార్‌, మయూర్‌ అశోక్‌ తదితరలు ఉన్నారు. ఫ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ  పరేడ్‌ పాల్గొన్న సీతం ఇంజినీరింగ్‌ కళాశాల  విద్యార్థిని అన్నా నేహా థామస్‌ను కలెక్టర్‌ సూర్యకుమారి శనివారం తన చాంబర్‌లో అభినందించారు. కార్యక్రమంలోని  కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ రామ్మూర్తి, డీన్‌ డాక్టర్‌ నరేంద్ర, ఎన్‌సీసీ ఆఫీసర్‌ లెఫ్టనెంట్‌ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

 

Read more