స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం

ABN , First Publish Date - 2022-12-12T00:36:55+05:30 IST

సహకారం అవసరమని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. మంగళపాలెం గ్రామంలో ఉన్న గురుదేవ చారిటబుల్‌ ట్రస్టులో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల కేన్సర్‌ పాలెటివ్‌ ఆసుపత్రికి ఆదివారం ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం క్రిటికల్‌ కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం తీసుకొచ్చే ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు కూడా చేరాలంటే గురుదేవ చారిటబుల్‌ ట్రస్టువంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. ట్రస్టును ఏర్పాటు చేశాఖ ఈ 24 సంవత్సరాల్లో లక్షా 54 వేలమంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను నిరంతరాయంగా అందించడం సాధారణ విషయం కాదన్నారు. కార్యక్రమానికి హాజరైన సెంట్రల్‌ విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ కేవీ చౌదరి మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ) పథకం కింద కార్పొరేట్‌ సంస్థలు ఇటువంటి సంస్థలకు చేయూత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌అశోక్‌, పారిశ్రామిక వేత్తలు, గురుదేవ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.

స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న మిజోరాం గవర్నర్‌ హరిబాబు

మిజోరాం గవర్నర్‌ హరిబాబు

కొత్తవలస, డిసెంబర్‌ 11 : దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. మంగళపాలెం గ్రామంలో ఉన్న గురుదేవ చారిటబుల్‌ ట్రస్టులో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల కేన్సర్‌ పాలెటివ్‌ ఆసుపత్రికి ఆదివారం ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం క్రిటికల్‌ కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం తీసుకొచ్చే ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు కూడా చేరాలంటే గురుదేవ చారిటబుల్‌ ట్రస్టువంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. ట్రస్టును ఏర్పాటు చేశాఖ ఈ 24 సంవత్సరాల్లో లక్షా 54 వేలమంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను నిరంతరాయంగా అందించడం సాధారణ విషయం కాదన్నారు. కార్యక్రమానికి హాజరైన సెంట్రల్‌ విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ కేవీ చౌదరి మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ) పథకం కింద కార్పొరేట్‌ సంస్థలు ఇటువంటి సంస్థలకు చేయూత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌అశోక్‌, పారిశ్రామిక వేత్తలు, గురుదేవ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-12T00:37:24+05:30 IST