టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-11-25T00:06:50+05:30 IST

టీడీపీకి నెల్లిమర్ల నియోజక వర్గం కంచుకోట వంటిదని, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు పిలుపునిచ్చారు.

టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి
మాట్లాడుతున్న మాజీ మంత్రి పతివాడ

పూసపాటిరేగ: టీడీపీకి నెల్లిమర్ల నియోజక వర్గం కంచుకోట వంటిదని, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు పిలుపునిచ్చారు. చల్లవానితోట గ్రామంలో గురువా రం ఏర్పాటుచేసిన టీడీపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల చేర్పుల విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్‌ లెవల్‌ కార్యకర్తలు తగు శ్రద్ధ వహించాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు పూర్తిగా సిద్ధం కావాలని, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతిఒక్క కార్యకర్త కష్టించి పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకిరి ప్రసాదరావు, పార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు, నాయకులు ఇజ్జిరోతు ఈశ్వరరావు, విక్రంజి జగన్నాథం, పతివాడ తమ్మినాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:06:50+05:30 IST

Read more