రుణాలను సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2022-08-04T05:46:53+05:30 IST
చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి జగనన్న తోడు ఎంతో బాసటగా ఉంటుందని జేసీ మయూర్ అశోక్ చెప్పారు.
జేసీ మయూర్ అశోక్
విజయనగరం (ఆంధ్రజ్యోతి): చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి జగనన్న తోడు ఎంతో బాసటగా ఉంటుందని జేసీ మయూర్ అశోక్ చెప్పారు. బుధవారం జగనన్న తోడు ఐదో విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద ఐదో విడత నిధులు సంబంధిత ఖాతాదారుల ఖాతాలకు జమ చేసే కార్య క్ర మం విజయవాడలోని తాడేపల్లిలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ప్రారం భించారన్నారు. జగనన్న తోడు పథకం కింద ఐదో విడతలో జిల్లా మొ త్తం 19,777 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 19 కోట్ల 77 లక్షలు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో మొత్తం ఐదు విడతల్లో 76,167 మంది లబ్ధిదారులకు రూ.76.16 కోట్లు జగనన్న తోడు కింద లబ్ధి కలిగిం దన్నారు. జగనన్న తోడు చెక్కును లబ్ధిదారులకు అందించిన ఆనంతరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో రుణ సహాయం పొందిన వారంతా శతశాతం తిరిగి చెల్లిస్తున్నారని, దీంతో ఈ పఽథకం ద్వారా వడ్డీ పరి హారం అందరికీ లభిస్తుందన్నారు. అదే విధంగా బ్యాంకర్లు రుణాలు అందించ టానికి ముందుకు రావటం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, కంబాల జోగులు, మేయర్ వీవీ లక్ష్మీ, డీఆర్డీఏ పీడీ ఎ. కల్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సు ధాకర్ తదితరులు పాల్గొన్నారు.