ఎంఈవోపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-12-31T00:31:38+05:30 IST

పార్వతీపురం మండల విద్యాశాఖ అధికారి వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులు శుక్రవారం వినూత్నంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 ఎంఈవోపై చర్యలు తీసుకోండి
మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న యూటీఎఫ్‌ సంఘం నేతలు, ఉపాధ్యాయులు

పార్వతీపురం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండల విద్యాశాఖ అధికారి వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులు శుక్రవారం వినూత్నంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో టీచర్లు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరితే ఎంఈవో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, లీవ్‌ మంజూరు కోసం వెళ్లిన వారిని యూటీఎఫ్‌లో ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. రెండురోజులోగా ఎంఈవోపై చర్యలు తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని యూటీఎఫ్‌ నాయకులు టి.రమేష్‌ , ఎస్‌.మురళీమోహన్‌రావు తదితరులు హెచ్చరించారు.

Updated Date - 2022-12-31T00:31:39+05:30 IST