అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-12-15T00:19:24+05:30 IST
అనారోగ్యం తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది.
సాలూరు: అనారోగ్యం తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొంకివీధికి చెందిన గంగుల నాగరాజు (30) కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడు తున్నారు. ఎంతకీనయం కాకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చీర కట్టి ఉరిపోసుకున్నాడు. నాగరాజు ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గుడికి వెళ్దామని చెప్పడంతో పక్కనే గల తన కన్నవారింటికి వెళ్లి రడీ అయి వచ్చేసరికి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు నాగురాజు భార్య శ్రావణి బోరున విపిస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.